ఇంగ్లండ్ తో జరిగిన మొదటి వన్డే లో భారత ఆటగాళ్ల ఎంపిక పై మైకేల్ వాన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. రిషబ్ పంత్‌ను పక్కనపెట్టినా.. టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణించిన స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌కు చోటు ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డాడు. మొదటి వన్డే కోసం కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత జట్టులో మార్పులు చేశాడు. పంత్ స్థానంలో కేఎల్ రాహుల్ జట్టులోకి రాగా.. కృనాల్ పాండ్యా, ప్రసీద్ కృష్ణ వన్డేల్లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మైకేల్ వాన్ మాట్లాడుతూ… ‘ మొదటి వన్డే మ్యాచ్‌లో ఆటగాళ్ల ఎంపిక నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. రిషబ్ పంత్ చాలాకాలంగా విరామం లేకుండా మ్యాచ్‌లు ఆడుతూనే ఉన్నాడు. కాబట్టి అతడికి టీమిండియా మేనేజ్మెంట్ కాస్త విశ్రాంతినివ్వాలని భావించి పక్కన పెట్టి ఉంటుంది. కానీ మొదటి వన్డేలో సూర్యకుమార్ యాదవ్‌ను ఆడించాల్సి ఉండాల్సింది. అతడు టీ20 మ్యాచ్‌లలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. హాఫ్ సెంచరీతో తనను తాను నిరూపించుకున్నాడు. 50 ఓవర్ల క్రికెట్‌లోనూ అతడు రాణించగలడు. అలాంటి మంచి ఆటగాడిని పక్కన పెట్టడంతో ఆశ్చర్యానికి లోనయ్యా’ అని మైకేల్ వాన్ పేర్కొన్నాడు.
previous post
next post