telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కూలీలకు భోజన సదుపాయం కల్పించనున్న హృతిక్… లాక్ డౌన్ ఉన్నన్ని రోజులూ…!!

Hrithik-Roshan

క‌రోనా మ‌హమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అనేక రకాలుగా చ‌ర్య‌ల‌ను చేప‌డుతున్నాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా షూటింగ్‌లకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. దీంతో సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ప‌లువురు సెల‌బ్రిటీలు ప్ర‌భుత్వాల‌కు విరాళాల‌ను అందించ‌డ‌మే కాకుండా నైతికంగా త‌మ మ‌ద్ద‌తుని తెలియ‌జేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది తెలుగు సినిమా నటులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పీఎం రిలీఫ్ డ్‌కు తమ వంతు ఆర్ధిక సాయం అందిస్తున్నారు. తాజాగా హృతిక్ రోషన్ కూడా కరోనా పై పోరులో తన వంతుగా సాయం చేయడానికి ముందుకు వచ్చారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి రోజువారీ కూలీ నాలీ చేసుకునే వారికి ఒక లక్ష 20 మీల్స్‌ను ప్రతిరోజు లాక్‌డౌన్ ఎప్పటి వరకు ఉంటే అప్పటి వరకు ఉచితంగా భోజన సదుపాయం కల్పించనున్నట్టు తెలిపారు. వీళ్లతో పాటు సీనియర్ సిటిజన్స్‌కు కూడా భోజన సదుపాయం కల్పించాలని నిర్ణయించారు. మొత్తానికి కరోనా పై పోరాటంలో హృతిక్ రోషన్ తన వంతుగా సాయం చేయడానికి ముందుకు రావడం మంచి విషయమనే చెప్పాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళం ఇస్తూనే మరోవైపు ఇలా సామాజిక సేవలో పాలు పంచుకుంటున్నాడు ఈ గ్రీకువీరుడు.

Related posts