telugu navyamedia
సినిమా వార్తలు

నామీద నాకే అసహ్యం వేసింది : విద్యాబాలన్

Vidyabalan

బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ భాషల్లో కూడా సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. ఈ బ్యూటీ ఒకప్పుడు శరీర బరువు విషయంలో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. అప్పట్లో తనకు థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉందని, అందుకే అధికంగా బరువు పెరుగుతున్నానని, డైటింగ్ చేసినా సమస్య పరిష్కారం కావడం లేదని విద్యాబాలన్ అభిమానులతో చెప్పుకొచ్చేది. తాజాగా ఆమె బాడీ షేమింగ్ గురించిఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సమస్య వేధిస్తున్న సమయంలో తనపై తనకే అసహ్యం వేసేదని చెప్పారు విద్యాబాలన్. “నా శరీరంతో నేను పోరాడాల్సి వచ్చినప్పుడు ఎంతో విరక్తిగా అనిపించేది. నా శరీరాన్ని నేను మార్చుకోగలిగినప్పుడే అందరూ ఆదరిస్తారని అనిపించింది. అయితే అంతకుముందు నేను చాలా సన్నగా ఉండే దానిని. అప్పుడు కూడా విమర్శలు ఎదుర్కొన్నాను. అందుకే విమర్శలను పక్కనపెట్టి, నా సంతృప్తి కోసం నా శరీర బరువును తగ్గించుకునే ప్రయత్నం మొదలుపెట్టాను. ఇందుకు చాలా సమయం పట్టింది. ఇప్పుడు నేను చాలా ఆనందంగా ఉన్నాను. నాకు నేనే ఎంతో అందంగా కనిపిస్తున్నాను. ఇప్పుడు నా శరీరం గురించి కామెంట్లు చేయాలని ఎవరూ అనుకోరు” అని తెలిపారు.

Related posts