బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్, రితేశ్ దేశ్ ముఖ్, బాబీడియోల్ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘హౌస్‌ఫుల్ 4’. ఫర్హాద్ సంఝీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్‌కు జోడీగా కృతిసనన్, రితేశ్ దేశ్‌ముఖ్‌కు పూజా హెగ్డే, బాబీ డియోల్‌కు కృతి కర్బంద జోడీగా నటించారు. అక్షయ్ కుమార్ రాజకుమారుడు బాలా, హ్యారీ పాత్రల్లో పండించిన కామెడీ ప్రేక్షకులను అలరిస్తోంది. అక్టోబర్ 26న విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ చిత్రం ఐదు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. 5వ రోజు నాటికి రూ.111.78 కోట్లు వసూలు చేసింది. అక్షయ్ కెరీర్ లో వంద కోట్ల క్లబ్ లో చేరిన 13వ చిత్రంగా హౌస్ ఫుల్ 4 నిలిచింది.
previous post
అమితాబ్ లెజెండ్… ఆయనంటే నాకు చాలా గౌరవం… కానీ… : తాప్సి