telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

మొసలి కళ్ళు పీకేసిన 11 ఏళ్ళ బాలిక… ఎందుకంటే ?

Alligator

జింబాబ్వేలో ఈ సంఘటన చోటుచేసుకుంది. రెబెకా ముంకాబ్వే(11) అనే బాలిక తన స్నేహితురాలు లతోయా(9)తో కలిసి జింబాబ్వేలో ఉన్న సిందెరెలా గ్రామంలోని ఓ చెరువు వద్దకు వెళ్లింది. చెరువులో ఈత కొడుతుండగా లతోయా(9) అనే బాలికను మొసలి పట్టుకుంది. వెంటనే భయంతో లతోయా కేకలు వేయగా.. రెబెకా ప్రాణాలకు తెగించి మరీ మొసలి మీదకు దూకింది. చేతులతోనే మొసలి కళ్లను గుచ్చేసి కళ్లను పీకేసింది. దీంతో మొసలి ఒక్కసారిగా బాలికను వదిలి వెళ్లిపోయింది. రెబెకా లతోయాను వెంటనే ఒడ్డుకు చేర్చింది. రెబెకాకు ఈ ఘటనలో ఎటువంటి గాయాలు కాలేదు. లతోయాకు మాత్రం చిన్న చిన్న గాయాలు అవడంతో.. ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. స్నేహితురాలి కోసం సాహసం చేసిన రెబెకాపై నెటిజన్లు విపరీతంగా ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related posts