telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“వకీల్ సాబ్”ను వెంటాడుతున్న లీకుల సమస్య

Vakil Sab

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ “వకీల్ సాబ్”‌కు లీకుల బెడద తప్పలేదు. ‘వకీల్ సాబ్’ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్ర పోషిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ముగ్గురు హీరోయిన్స్ నివేదా థామస్, అనన్య నాగేళ్ల, అంజలి నటిస్తున్నారు. ఈ ముగ్గురే గాక మరో హీరోయిన్‌కి కూడా స్కోప్ ఉందని సమాచారం. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ గత కొంతకాలంగా కరోనా విజృంభణ వల్ల వాయిదా పడింది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించి ఎలాంటి లీక్స్ లేకుండా జాగ్రత్త పడుతూ వస్తున్న చిత్ర యూనిట్‌కి సడెన్ షాక్ తగిలింది. పవన్ కళ్యాణ్ లాయర్ గెటప్‌లో కోర్టులో వాదిస్తున్న స్టిల్ ఒకటి లీక్ అయింది. ఇది కాస్త వెంటనే సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ స్టిల్ ఎలా లీక్ అయ్యిందనే విషయమై ఆరా తీస్తున్నారు యూనిట్ సభ్యులు. మెగాస్టార్ తమ్ముడిగా సినీ రంగప్రవేశం చేసి వరుసగా 25 సినిమాలు చేసిన పవన్.. ఆ తర్వాత రాజకీయ బాట పట్టారు. అయితే నిర్మాతల కోరిక మేరకు తిరిగి కెమెరా ముందుకొచ్చిన ఆయన మొదటగా ఈ ‘వకీల్ సాబ్’ మూవీ చేస్తున్నారు. సినిమా స్టార్టింగ్ రోజునే ప‌వ‌న్ క‌ల్యాణ్ లుక్ లీక్ అయిన సంగ‌తి తెలిసిందే.

Related posts