telugu navyamedia
సినిమా వార్తలు

హేమమాలినికి మనవరాలు జన్మించింది

Esha-Deol-and-BHarath

బాలీవుడ్ ప్రముఖ నటి, డ్రీమ్ గాళ్, బీజేపీ ఎంపీ హేమమాలినికి మనవరాలు జన్మించింది. హేమమాలిని కుమార్తె ఈషాడియోల్, అల్లుడు భరత్ తఖ్తానీ దంపతులకు రెండో కాన్పులో పండంటి ఆడబిడ్డ జన్మించింది. తనకు ఆడబిడ్డ జన్మించిన విషయాన్ని ఈషాడియోల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ నెటిజన్లతో ఆనందాన్ని పంచుకున్నారు. తన కూతురికి “మిరయ” అని పేరు పెట్టినట్లు ఈ పోస్ట్ లో ఈషాడియోల్ తెలిపారు. మనవరాలు పుట్టడంతో అమ్మమ్మ హేమమాలిని దంపతులు ఎంతో సంతోషపడతారని ఈషా పేర్కొన్నారు.

Related posts