telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆర్టీసీపై .. హైకోర్టు కీలక నిర్ణయం నేడే.. కేసీఆర్ కు చెక్ దిశగా.. .బీజేపీ వ్యూహం ఫలించిందా..

high court on new building in telangana

ఆర్టీసీ సమస్య పరిష్కారంపై హైకోర్టు కమిటీ ని ప్రతిపాదించిన్నవిషయం తెలిసిందే. చర్చలలో ప్రతిష్టంబన తో ముగ్గురు సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జిలతో ఒక కమిటీని నియమించాలని కోర్టు తెలిపింది. దీనిపై నేడు 10 గంటల్లోగా రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం తెలపాలని ధర్మాసనం ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్‌ జనరల్‌ బిఎస్‌ ప్రసాద్‌కు సూచించింది. సమ్మె విషయంలో న్యాయస్థాన నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని కార్మిక సంఘాల జెఎసి తెలిపింది.

ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ఆర్టీసీ ఇన్‌ఛార్జ్‌ ఎండీ సునీల్‌శర్మ, అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌, ఆర్టీసీ, రవాణా శాఖ ఉన్నతాధికారులతో కేసీఆర్ సమావేశం అయ్యారు. న్యాయస్థానం లేవనెత్తిన అంశాలతో పాటు ప్రభుత్వం తరఫున నేడు ఇవ్వాల్సిన వివరణపై కేసీఆర్‌ వారితో చర్చించారు. జడ్జిల కమిటీకి అంగీకరిస్తే ఆ కమిటీకి ఉన్న న్యాయపరిధి, అధికారాలు, తదితర అంశాలపై ఎజితో సిఎం సమాలోచనలు చేశారు. అయితే, జడ్జిల కమిటీకి సుముఖత వ్యక్తంచేయని సిఎం..కమిటీ విధి,విధానాల ఆధారంగా నిర్ణయం తీసుకుందామని అడ్వకేట్‌ జనరల్‌తో అన్నట్లు తెలిసింది. ఆర్టీసీ సమ్మెతో కేంద్రప్రభుత్వం తెలంగాణాలో కేసీఆర్ పై తమదైన శైలిలో వ్యూహరచన చేస్తున్నారు. కేసీఆర్ పై దెబ్బ కొట్టేందుకు ఇదే సరైన సమయంగా బీజేపీ భవిస్తూ, ఆర్టీసీ సమస్యను మరింతగా జటిలం చేస్తూ, కేసీఆర్ కు కష్టకాలం తెచ్చిపెడుతూనే ఉంది. లేకపోతే ప్రజా రవాణా ఇన్నాళ్లు ఆగితే, దానిపై ఇంత నత్తనడక పరిష్కారం ఏంటని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ దెబ్బతో బీజేపీ తెలంగాణాలో పై చెయ్యి సాధిస్తుందా.. అనేది చూడాల్సి ఉంది. ఇప్పటికైతే సాధించినట్టే.

Related posts