telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాని కొత్త సినిమా ‘హిట్’ దర్శకుడితో… ?

Nani

నేచురల్ స్టార్ నాని హీరోగా ‘వీ’సినిమా తన అభిమానుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తర్వాత నాని ‘ శ్యామ్ సింగ రాయ్’ను చేసేందుకు రెడీగా ఉన్నాడు. కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలోనే ఆయన దర్శకుడు శైలేశ్ కొలనుకు అవకాశం ఇచ్చినట్టుగా ఫిల్మ్ నగర్లో టాక్ నడుస్తోంది. కొత్త దర్శకులతో చేయడానికి నాని మొదటి నుంచి ఆసక్తినిచూపిస్తూనే వస్తున్నాడు. అలాగే శైలేశ్ కొలనుకు దర్శకుడిగా అవకాశం ఇస్తున్నారు. శైలేష్ ఇటీవల ‘హిట్’ సినిమాను నిర్మించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమాకి మంచి పేరు వచ్చింది. హిట్ సినిమాతో దర్శకుడిగా మంచి మార్కులు తెచ్చుకున్న శైలేశ్ కొలను, రీసెంట్ గా నానీకి ఒక కథ వినిపించినట్లు సమాచారం. ఆ కథ నానీకి నచ్చడంతో, పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకుని రమ్మని చెప్పాడని అంటున్నారు. ఈ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలు ఎక్కువనే టాక్ వినిపిస్తోంది.

Related posts