telugu navyamedia
సినిమా వార్తలు

“ఒకే ఒక జీవితం” సినిమా చూసి శ‌ర్వానంద్ ఎమోష‌నల్..

యంగ్ హీరో శర్వానంద్ హీరోగా న‌టించిన తాజా చిత్రం “ఒకే ఒక జీవితం”. శ్రీ కార్తీక్ దర్శకత్వంలో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కించిన ఈ చిత్రంలో రీతూ వర్మహీరోయిన్‌గా న‌టించింది.

ఈ సినిమా సెప్టెంబర్ 9న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో అక్కినేని అమల.. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలకపాత్రలలో నటించారు. విడుదలైన మొదటి రోజే అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది ఈ మూవీ.

Oke Oka Jeevitham Review: Emotionally charged

డైరెక్టర్ శ్రీకార్తీక్ తెరకెక్కించిన ఈ సినిమా తల్లి.. కొడుకుల మధ్య బంధాన్ని చూపిస్తుంది. కళారంగంలో సంగీతాకళాకారుడిగా ఎదగాలనుకున్నఓ కుర్రాడికి.. ఎదురైన పరిస్థితులు.. తల్లి మరణంతో జీవితంపై ఆశలు కోల్పోతాడు. కానీ ఓ సైంటిస్ట్ సాయంతో మళ్లీ గతంలోకి తన స్నేహితులతో కలిసి వెళ్లిన తర్వాత తన తల్లిని కలుసుకోవడం.. ఎదురైన సందర్భాలు ఈ సినిమాలో చూడవచ్చు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించారు.

అయితే శుక్రవారం తన తల్లితోపాటు కుటుంబంతో కలిసి ఈ సినిమా ను శర్వానంద్ చూశారు. మథర్ తో కలిసి థియేటర్లలో సినిమా చూసి వస్తున్న వీడియోను షేర్ చేస్తూ మనసు నిండిపోయింది అంటూ క్యాప్షన్ ఇచ్చారు శర్వానంద్. అందులో తన కుటుంబం శర్వాను అప్యాయంగా పలకరిస్తూ కనిపించారు.

Related posts