telugu navyamedia
తెలంగాణ వార్తలు

హైద‌రాబాద్‌లో మ‌ళ్ళీ భారీ వ‌ర్షం..లోతట్టు ప్రాంతాలు జలమ‌యం

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం..లోతట్టు ప్రాంతాలు జలమ‌యం
బంజారాహీల్స్‌, జూబ్లీ హీల్స్ పంజాగుట్ట‌లో భారీ వ‌ర్షం..

భాగ్య‌నగరానికి వ‌రుణుడు వీడడం లేదు.మధ్నాహ్నాం వరకు ఎండ కొట్టగా.. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.ఏకధాటిగా గంటసేపు వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి..మోకాళ్ల లోతుకుపైగా వరద చేరడంతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు.

మియాపూర్‌, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, హైదర్‌నగర్, ప్రగతి నగర్‌, బాచుపల్లి, జీడిమెట్ల, బాలానగర్‌, అపురూపకాలనీ, కుత్బుల్లాపూర్‌, గాజులరామారం, సూరారం, అమీర్‌పేట, ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌, అసెంబ్లీ, బషీర్‌బాగ్‌, బేగంబజార్‌, కోఠి, సుల్తాన్‌బజార్‌, అబిడ్స్‌, నాంపల్లి, హిమాయత్‌నగర్‌, నారాయణగూడ, లిబర్టీ, ముషీరాబాద్‌, చిక్కడపల్లి, అచ్యుత్‌రెడ్డి మార్గ్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌, కవాడిగూడ, బోలక్‌ పూర్‌, గాంధీనగర్‌, రాంనగర్‌, దోమల గూడ, ఉప్పల్‌, రామంతాపూర్‌, దిల్‌సుఖ్‌ నగర్‌, కొత్తపేట, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది.

దీంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఉద్యోగులు ఇంటికి వెళ్తున సమయంలో వర్షం పడుతుండడంతో తీవ్ర వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి రోడ్లపై నరకయాతన అనుభవిస్తున్నారు.

Related posts