telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఆంధ్ర ప్రదేశ్‌లో మూడు రోజుల పాటు భారీ వ‌ర్షాలు

 

ఇప్పటికే కొన్ని రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలు.. ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు వర్షాలు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల రానున్న 24 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

24 గంటల్లో ఇది పశ్చిమ–వాయవ్య దిశగా ప్రయాణించి దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ తీరాలను చేరుకునే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.. మరోవైపు నైరుతి రుతుపవనాల తిరోగమనం కొనసాగుతోందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

AP Weather Report: Heavy rains hit parts of the state, to continue for next three  days

ప్రస్తుతము తూర్పు-పశ్చిమ ఉపరితల ద్రోణి 13°N అక్షాంశము వెంబడి తూర్పుమధ్య బంగాళాఖాతం & దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం నుండి కర్ణాటక తీరానికి దగ్గరగా తూర్పు మధ్య అరేబియా సముద్రం ప్రాంతములో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వరకు సగటు సముద్రమట్టానికి 4.5 km నుండి 5.8 km ఎత్తుల మధ్య కొనసాగుతోంద‌ని వాతావరణ శాఖ తెలిపింది.

 

Related posts