telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

పోటీ చేసిందే 65 .. 88 సీట్లు ఎలా వస్తాయి జేడీగారు..?

జనసేన నాయకుడు జేడీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యల పై  వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.  ఇటీవల  తమ జనసేన పార్టీ 88సీట్లు గెలుచుకోని అధికారంలో చేపడుతుందని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కాగా.. ఆయన చేసిన కామెంట్స్ కి విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 
జనసేన సొంతంగా పోటీచేసిందే 65 స్థానాల్లో అలాంటిది 88 స్థానాల్లో ఎలా గెలుస్తుందని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.  ‘సొంతంగా పోటీ చేసిందే 65 సీట్లలో. పవన్ కళ్యాణ్ అనుంగు అనుచరుడు జేడీ లక్ష్మీనారాయణేమో 88 స్థానాల్లో గెల్చి జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని జోస్యం చెబుతున్నారు. ఇతను దర్యాప్తు చేసిన కేసుల్లో కూడా ఇలాగే లేనివి ఉన్నట్టు రాసాడు. ఇది కూడా చంద్రబాబు బ్రీఫింగేనా?’ అని ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు.

Related posts