telugu navyamedia
రాశి ఫలాలు

అక్టోబ‌ర్ 14, గురువారం రాశిఫ‌లాలు..

మేషం
ఆకస్మిక ధనలబ్ధి. ప్రయాణాలలో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలయ దర్శనాలు. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. ఎదుటివారితో మితంగా సంభాషించటం మంచిది.ఒక స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన అవసరం.

వృషభం
మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. పరిస్థితులు అనుకూలించవు. ప్రయాణాలు వాయిదా ప‌డ‌తాయి. శ్రమ తప్పదు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం.

మిథునం
బంధువులతో విరోధాలు ఏర్ప‌డ‌తాయి. శ్రీమతి సలహా పాటించటంవల్ల ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. అనారోగ్యం భారీన ప‌డ‌వ‌చ్చు. పనులు కొన్ని వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు ఎదుర్కోవ‌ల‌సి వ‌స్తుంది.

కర్కాటకం
మిత్రులతో సఖ్యత ఏర్ప‌డుతుంది, సోదరీ, సోదరులతో విబేధాలు తలెత్తుతాయి . విచిత్రమైన సంఘటనలు, వాహనసౌఖ్యం క‌ల‌దు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స‌మాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు మొద‌లవుతాయి.

సింహం
ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్, ఆటోమొబైల్ రంగాల వారికి పని భారం అధికంగా ఉంటుంది. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారాలు లాభదాయకం. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. భూలాభాలు. ప్రముఖులతో పరిచయాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కన్య
కొత్త రుణయత్నాలు. ప్రైవేటు సంస్థల్లో వారికి సదవశాలు లభిస్తాయి. ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు, ఆస్తి వివాదాలు, అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.ఎల్.ఐ.సి, పోస్టల్ ఏజెంట్లకు ఒత్తిడి పెరుగుతుంది

తుల
బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, ఆదనపు బాధ్యతలు పనిభారం వంటి చికాకులు తప్పవు. శ్రమకు త‌గ్గ‌ ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆరోగ్యభంగం. పనులు ముందుకు సాగవు. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు ఏర్ప‌డ‌తాయి.

వృశ్చికం
అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. దూరపు బంధువుల కలయిక. పట్టుదలతో ముందుకు సాగి ఎంతటి కార్యానైనా సాధిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు.

ధనుస్సు
కుటుంబసభ్యులతో తగాదాలు. దూరప్రయాణాలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తప్పకపోవచ్చు. నిరుద్యోగులకు అవకాశాలు లభించినప్పటికి వాటిని సద్వినియోగించుకోలేకపోతారు.

మకరం
పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. స‌మాజంలో పలుకుబడి పెంచుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.పాత మిత్రుల కలయికతో గత అనుభవాలుపైకి వస్తాయి.

కుంభం.
కుటుంబంలో చికాకులు. ఆరోగ్యసమస్యలు. కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు. ప్రయాణాలు రద్దు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళపరుస్తాయి.బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. అనుక్షణం మీ సంతానం విద్యా, ఉద్యోగ విషయాలపైనే మీ ఆలోచనలుంటాయి.

మీనం
సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి నూతన ఆలోచనలు స్ఫురించగలవు. బాకీలు వసూలవుతాయి. ఆసక్తికర సమాచారం. చర్చలు సఫలం. వాహనయోగం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సానుకూలం.

Related posts