telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణలోరెండు రోజుల పాటు భారీ వర్షాలు..

తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. గత వారం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు వినాయక చవితి తర్వాత తగ్గుముఖం పట్టాయి. మరోసారి రాష్ట్రంలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని తెలిపింది.

బంగాళాఖాతంలోని వాయవ్య ప్రాంతంలో ఆవర్తనం ఏర్పడింది. ఇది నేడు ఒడిశా తీరానికి చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో నేడు స్వల్పంగా, రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత కూడా మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కురిసే ఈ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

జోరు వానలో.. కారు నీడలో..

వానలోనూ సాగుతున్న గణేశ్ శోభాయాత్ర..
హైద‌రాబాద్ కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. మహాగణపతి నిమజ్జనానికి వెళ్లిన భక్తులు వానలో తడిసిముద్దయ్యారు. మొజంజాహి మార్కెట్, కోఠి, సుల్తాన్​బజార్, హుస్సేన్​సాగర్, పాతబస్తీ ప్రాంతాల​లో మోస్తం వాన పడింది. పలుచోట్ల రహదారులు జలమయమయ్యాయి. వర్షంలో నూ గణేశ్ శోభాయాత్ర కొనసాగుతోంది.

నిమజ్జనానికి అతిథిగా విచ్చేసిన వరుణుడు

చిరుజల్లుల్లో తడుస్తూ.. భక్తులు గణపతి ముందు స్టెప్పులేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వర్షం వల్ల ట్రాఫిక్ జామ్ అయింది. అధికారులు రంగంలోకి దిగి వెంటనే ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఆకాశమంత మేఘావృతమై ఉండటం వల్ల భారీ వర్షం కురిసే అవకాశముందని కొందరు భక్తులు గణేశ్ శోభాయాత్ర నుంచి ఇళ్లకు తిరిగి వెళ్తున్నారు. భారీ వాన పడితే.. వరదలో చిక్కుకుంటామేమోనని భయంతో వెనుదిరుగుతున్నారు. ఇంకొందరు మాత్రం జల్లుల్లో తడుస్తూ.. గణేశుణ్ని గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు.

Related posts