telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

కేటీఆర్ సవాల్‌పై హరీశ్ మౌనమా.. విజయశాంతి సంచలన వ్యాఖ్యలు!

vijayashanthi fires data missing issue
టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో.. మెదక్ లోక్‌సభ స్థానంలో సాధించబోయే ఓట్ల కంటే కనీసం రెండు ఓట్లైనా గెలిచి చూపిస్తామని హరీశ్‌రావుకి కేటీఆర్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్ విజయశాంతి తనదైన శైలిలో స్పందించారు. టీఆర్ఎస్‌లో వారసత్వం, కేటీఆర్-హరీశ్‌రావుల మధ్య ఆధిపత్యపోరుపై ఆమె  విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
2009 ఎన్నికల్లో 162 ఓట్లతో సిరిసిల్లలో గెలిచిన కేటీఆర్.. అదే ఎన్నికల్లో ఎనభై వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన హరీశ్‌రావుకి సవాల్ విసరడం విడ్డూరంగా ఉందన్నారు.మరి కేటీఆర్ సవాల్‌ను స్వీకరించి… హరీశ్ ఎక్కువ ఓట్లు సాధించి చూపుతారో లేక కేటీఆర్‌తో పెట్టుకుంటే పూర్తిగా పాతాళానికి తొక్కుతారేమోనని భయపడి రెండు ఓట్లు కరీంనగర్‌ జిల్లాకు వదిలేస్తారో చూడాలన్నారు. కేటీఆర్ సవాల్‌పై హరీశ్ మౌనం పాటించడంపై టీఆర్ఎస్‌లో ముఖ్యమంత్రి కుమారుడి ఆధిపత్యం ఎలా ఉందో అర్థమవుతోందని విజయశాంతి దుయ్యబట్టారు.

Related posts