telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

తెరాస సొంత సర్వే .. 16 లోక్ సభ స్థానాలు తమకే..

MLC Elections Won By TRS MIM

టీఆర్‌ఎస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించబోతున్నదని తాజా సర్వే వెల్లడించింది. టీఆర్‌ఎస్ పార్టీ మార్చి 25 నుంచి 30 వరకు సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం.. 16 చోట్ల టీఆర్‌ఎస్, హైదరాబాద్‌లో ఎంఐఎందే గెలుపు అని వెల్లడయింది. భారీ మెజార్టీతో టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయమని తాజా సర్వేలు చెబుతున్నాయి. విపక్షాలు టీఆర్‌ఎస్‌కు దరిదాపుల్లో కూడా లేవు. పార్లమెంట్ నియోజకవర్గాల్లో నిర్వహించిన సర్వేల్లో టీఆర్‌ఎస్‌కు జనాలు పట్టంకట్టారు. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయ సేకరణ తీసుకున్నారు.

ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో 9 గ్రామాలు, మండలాలు, డివిజన్లలో శాంపిల్స్ సేకరించారు. టీఆర్‌ఎస్‌కు 57.45 శాతం ఓటర్లు జైకొట్టారు. కాంగ్రెస్‌కు 28, బీజేపీకి 11.85 శాతం మంది మద్దతు ఇచ్చారు. టీఆర్‌ఎస్‌కు 62.29 శాతం మహిళలు మద్దతు పలికారు. 53.84 శాతం పురుషులు టీఆర్‌ఎస్‌కే ఓటేస్తామన్నారు. ఆదిలాబాద్, భువనగిరి, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, వరంగల్, జహీరాబాద్ పోటీలో ఉన్న టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీలనే జనం గెలిపిస్తామంటున్నారు. మహబూబ్‌నగర్, నల్లగొండ, మహబూబాబాద్, ఖమ్మం, మల్కాజ్‌గిరి, పెద్దపల్లిలో టీఆర్‌ఎస్‌కే ఓటేస్తామంటున్నారు. చేవెళ్ల, నాగర్‌కర్నూల్, సికింద్రాబాద్‌లో మిగితా పార్టీల కంటే టీఆర్‌ఎస్ బెస్ట్ అని సర్వేలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లో ఎంఐఎం అభ్యర్థికి జనం మద్దతు పలికారు.

* టీఆర్‌ఎస్‌కు 56.6 శాతం నేత, స్వర్ణకారులు, తదితర నైపుణ్య వృత్తి పనివారు మద్దతు పలికారు.
* టీఆర్‌ఎస్‌కు 54.85 శాతం ఆటో, క్యాబ్ డ్రైవర్లు మద్దతు పలికారు.
* 50.71 శాతం మంది రిటైర్డ్ ఉద్యోగులు గులాబీ వైపే ఉన్నారు.
* వ్యాపారస్థులు 49.04, ప్రైవేట్ ఉద్యోగులు 44.80 శాతం, యువత, విద్యార్థులు 39.54, ప్రభుత్వ ఉద్యోగులు 35.19 శాతం టీఆర్‌ఎస్‌కు మద్దతు పలికారు.
* 67.28 శాతం మైనార్టీలు; 58.47 శాతం బీసీలు, 58.71 శాతం ఎస్సీలు, 57.41 శాతం ఎస్టీలు, 48.11 శాతం ఓసీలు టీఆర్‌ఎస్‌కే ఓటేస్తామన్నారు.

trs own survey results on loksabhaతాజా సర్వే ప్రకారం మొత్తంగా టీఆర్‌ఎస్‌కు 57.45 శాతం ఓట్లు పడుతాయని తాజా సర్వే వెల్లడించింది.

Related posts