telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్ పై .. విమలక్క విసుర్లు.. విద్యార్థి సంఘాలు కూడా మద్దతు..

ou students meet to support tsrtc protest

ఉస్మానియా విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రధాన భూమిక పోషించారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటువంటి విద్యార్థి సంఘాలు నేడు ఓయూలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు పలికారు. ఆ విద్యార్థుల సహకారం తోనే సీఎం కేసీఆర్‌ కూడా గద్దెనెక్కిన విషయం మరిచిపోయినట్లు ఉన్నారని ప్రజా గాయకురాలు విమర్శించారు. ఇప్పుడు ఎవరైతే ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలుపుతున్నారో, ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారు అన్నారు. అసలు కేసీఆర్‌ది నోరా.. తాటిమట్టా అంటూ విమలక్క మండిపడ్డారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో గెలిచినందుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న కేసీఆర్‌ తన నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందన్నారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఉస్మానియా విద్యార్థి జేఏసీ విభాగం శుక్రవారం సంఘీభావ సభ ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా మాట్లాడిన విమలక్క.. ‘ఆర్టీసీ కథ ముగియదు.. కేసీఆర్‌ నువ్వు ఖతం అవుతావ్‌. ప్రజలు పెట్టిన భిక్షతోనే నువ్వు సీఎం అయ్యావ్‌. నువ్వు సీఎం అయ్యాక పోలీసుల రిక్రూట్‌మెంట్‌ తప్ప ఏ రిక్రూట్‌మెంట్‌ జరగలేదు. ఆర్టీసీ ఎప్పట్నుంచో ఉంది. కార్మికుల చేసే సమ్మెలో న‍్యాయం ఉంది. ఆర్టీసీ కార్మికుల చేస్తున్న సమ్మెపై హైకోర్టు స్పందించింది. కోర్టు ధిక్కరించిన వారికి గతంలో ఎలాంటి పరిస్థితి వచ్చిందో,.. ఇప్పుడు కేసీఆర్‌కు కూడా అదే పరిస్థితి రావాలి. ఆర్టీసీ కార్మికులకు సంఘీభావంగా అందరూ రోడ్డు మీదకు రావాలి. ఇది ఉద్యమాల గడ్డ.. పోరాటల గడ్డ. కార్మికులతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. కార్మికులు ఎవరూ చనిపోవద్దు.. అంతిమంగా మనదే విజయం’ అని విమలక్క పేర్కొన్నారు.

Related posts