telugu navyamedia
తెలంగాణ వార్తలు

గవర్నర్ ప్రసంగం లేకుండా తెలంగాణ‌ అసెంబ్లీ సమావేశాలు..

తెలంగాణ‌లో రేపట్నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ‘బడ్జెట్ సమావేశాల తొలి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది.. కానీ సాంకేతిక అంశం వల్ల ప్రభుత్వం దీనిని రద్దు చేసింది. అయితే బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడం మరోమారు చర్చనీయాంశమైంది.

శాస‌న‌స‌భ‌లో బ‌డ్జెట్ ప్రవేశ‌పెట్టేందుకు అనుమతిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సుధీర్ఘ ప్రక‌ట‌న విడుద‌ల చేశారు. ఆర్థిక బిల్లు సిఫార్సు చేసేందుకు సమయం తీసుకునే స్వేచ్చ ఉన్నప్పటికీ.. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సిఫార్సు చేశాను.

గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించడం సాధ్యం కాదని ప్రభుత్వం పేర్కొందని తమిళిసై సౌందర్‌రాజన్ పేర్కొన్నారు. సాంకేతిక కారణాలతోనే గవర్నర్ ప్రసంగాన్ని రద్దు చేశారని తమిళిసై తెలిపారు.

గవర్నర్ ప్రసంగం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం తన విజ్ఞతతో బడ్జెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసిందన్న తమిళిసై… కొత్త సెషన్ కానందున సాంకేతిక అంశాల కారణంగా గవర్నర్ ప్రసంగం సాధ్యం కాదని ప్రభుత్వం పేర్కొందన్నారు. ఐదు నెలల తర్వాత సభ సమావేశమవుతోందని.. గవర్నర్ ప్రసంగంతో సభ ప్రారంభం సాధ్యం కాదని ప్రభుత్వం వెల్లడించిందని ఆమె చెప్పారు.

రాజ్యాంగపరంగా..గవర్నర్‌కు కొన్ని అధికారులున్నాఉన్నప్పటికీ….. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అనుమతిచ్చానని ఆమె తెలిపారు. గవర్నర్ ప్రసంగాన్ని రాజ్​భవన్ తయారు చేయదని, అది ప్రభుత్వ ప్రకటన అని తమిళిసై స్పష్టం చేశారు.

గవర్నర్ ప్రసంగం లేకపోవడం వల్ల.. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడం వల్ల గతేడాదిగా ప్రభుత్వ పనితీరుపై చర్చించే అవకాశాన్ని సభ్యులు కోల్పోతున్నారని తమిళిసై తెలిపారు.

గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయని తొలుత చెప్పారని.. ఇప్పుడు అనుకోకుండా తప్పు రాశామని చెబుతున్నారని ఆమె అన్నారు. కొనసాగింపు అని ప్రభుత్వం అంటోందని తమిళిసై వెల్లడించారు.

మ‌రోవైపు..గవర్నర్ తమిళిసై ప్రకటనపై రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతుంది.ఉద్దేశపూర్వకంగానే గవర్నర్ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతున్నారని తెరాస వర్గాలు అంటున్నాయి.

మ‌రోవైపు గవర్నర్‌ను పట్టించుకోవడం లేదు. అవమానిస్తున్నారు. ప్రొటోకాల్ పాటించడం లేదు. వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదు అనేది తెలంగాణ బీజేపీ నేతలు అంటున్నారు.

Related posts