యాదాద్రిభువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. శ్రావణి హత్య కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఇంటిని గ్రామస్తులు ముట్టడించి, నిప్పుపెట్టారు. శ్రావణి, మనీషా ఇద్దరు అమ్మాయిలను అత్యాచారం చేసి చంపిన కేసులో అరెస్టైన సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి పై రగిలిపోతున్న గ్రామస్తులు మంగళవారం ఉదయం అతడి ఇంటిని ధ్వంసం చేసి నిప్పుపెట్టారు.
అడ్డుకున్న పోలీసులపైనా దాడికి యత్నించారు. శ్రీనివాస్‌రెడ్డిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.గ్రామలో ఉరి వేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో అతని ఇంటి వద్దవున్న పోలీసులు జనాన్ని అడ్డుకున్నారు. రేపిస్టు శ్రీనివాస్ రెడ్డి ఇంకెందరు బాలికలను చంపేశాడోనని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మైనార్టీల హక్కులు పూర్తిగా అణచివేస్తున్నారు: రఘువీరా