తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రేపు నాగర్ కర్నూలులో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా స్థానికంగా నిర్మించబోయే పలు భవనాలకు సీఎం శంఖు స్థాపన చేయానున్నారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు ప్రాతంలోని ప్రాజెక్టులను ఆయన పరిశీలిస్తారు.
సీఎం పర్యటన నిమిత్తం ఏర్పాట్లను ఆయా శాఖల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీఆర్ రాక సందర్భంగా నార్లాపూర్ వద్ద ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ ప్రాంతాన్ని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. పరిశిలించారు. ఆయన వెంట ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, స్థానిక నాయకులు ఉన్నారు.
ప్రత్యేక హోదా అంశాన్ని సజీవంగా ఉంచడంలో వైసీపీ సక్సెస్ అయ్యింది…