telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆర్టీసీ కార్మికులకు మరోసారి ప్రభుత్వం హెచ్చరిక

school buses for public transport

ఆర్టీసీ కార్మికులకు మరోసారి తెలంగాణ ప్రభుత్వం వార్నింగిచ్చింది. ఆర్టీసీ సమ్మె ప్రభావంపై మంత్రి పువ్వాడ అజయ్‌ సమీక్ష నిర్వహించనున్నారు. శనివారం సాయంత్రం 6 గంటల్లోగా విధుల్లో చేరని కార్మికులు ఇక ఆర్టీసీ ఉద్యోగులు కారని, భవిష్యత్తులో కూడా వారిని ఆర్టీసీ ఉద్యోగులుగా సంస్థ గుర్తించదని హెచ్చరించారు. ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

ముఖ్యంగా మూడు ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం పరిశీలీస్తున్నదని పువ్వాడ చెప్పారు. మూడు నుంచి నాలుగు వేల ప్రైవేటు బస్సులను అద్దెకు తీసుకుని నడపడం, ఆర్టీసీ బస్సులు నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్సు కలిగిన యువతీ యువకుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఉద్యోగావకాశం కల్పించడం.. వారికి తక్షణం తగు శిక్షణ ఇచ్చి, బస్సులను యధావిధిగా నడపడం తదితర చర్యలను తీసుకోనున్నట్టు ఆయన వివరించారు.

Related posts