కొఱ్ఱలు ఒక విధమైన చిరుధాన్యాలు. ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రధానమైన ఆహారంగా ఉపయొగపడే ధాన్యపు పంటగా రెండవ స్థానంలో ఉన్నది. దీని శాస్త్రీయ నామం సెటేరియా ఇటాలికా. ఇది ఎక్కువగా తూర్పు ఆసియా ప్రాంతంలో అతి ప్రాచీనకాలం నుండి పండిస్తున్నారు. చైనాలో సుమారు క్రీ.పూ.6వ శతాబ్దం నుండి పెంచబడుతున్నాయి. ప్రాథమిక లక్షణాలు కొర్రలు గడ్డిజాతికి చెందిన చిన్న మొక్కలు. ఇవి సన్నంగా ఆకులతో కప్పబడిన కాండం కలిగి సుమారు 120-200 సెం.మీ. (4-7 అడుగులు) పొడవు పెరుగుతాయి. కంకులు జుత్తును కలిగి సుమారు 5-30 సెం.మీ. (2-12 అంగుళాలు) పొడవుంటాయి. కొర్ర గింజలు చిన్నవిగా సుమారు 2 మి.మీ. వ్యాసం ఉండి పలుచని పొరతో కప్పబడి ఉంటాయి. ఈ పొట్టును దంచి సులువుగా వేరుచేయవచ్చును. గింజ ఎరుపు, పసుపు, తెలుపు, నలుపు రంగులలో నాలుగు రకములుగా ఉంటాయి. ఇందులోని ఫైబర్ అధికము గా ఉన్న కారణం గా ఇది తిన్న వారికి ఒంటి లో కొవ్వు తగ్గుతుంది.
ఉపయోగాలు
కొర్ర బియ్యంలో పరమాన్నం చేసుకొని తింటారు.
కొర్రలతో కూడా గంజి చేసుకొని తాగుతారు.
కొర్ర అన్నము మధు మేహ వ్వాది గ్రస్తులకు చాల మంచిది.
కొర్ర బియ్యంలో ప్రొటీన్లు ఎక్కువ.
ఉప్మాలాగా కూడ చెసుకొ వచ్చు.
గారెలు దొసెలు కూడ చెసుకొన వచ్చు.
previous post
next post
సెక్రటేరియట్‌కు మరో 70 ఏళ్ల పాటు ఢోకా లేదు: వీహెచ్