telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

భార్య కోసం ఆ పని చేసిన బ్రిటన్ ప్రిన్స్.!

బ్రిటన్‌ ప్రిన్స్‌ తన భార్య కోసం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. బ్రిటన్‌ ప్రిన్స్‌ హ్యారీ, మేఘన్‌ మెర్కెల్‌ దంపతులు రాచరికానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. రాచరికంతో సంబంధం లేకుండా స్వేచ్ఛగా జీవించాలని వీరు గతేడాది నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో హ్యారీ దంపతులకు రాచరిక హోదాలు, బిరుదులను తొలగించడంతో పాటు ఇకపై సైనిక గౌరవాలకు దూరంగా ఉంచుతారు. ప్రస్తుతం హ్యారీ దంపతులకు ఉన్న హిజ్‌ రాయల్‌ హైనెస్‌, హర్‌ రాయల్‌ హైనెస్‌ బిరుదులు, డ్యూక్‌ ఆఫ్‌ ససెక్స్‌, డచెస్‌ ఆఫ్‌ ససెక్స్‌ లాంటి హోదాలు కోల్పోతాడు. వీటిని రాజకుటుంబంలోని మిగతా సభ్యులకు క్వీన్‌ ఎలిజబెత్‌-2 పంచుతారని బకింగ్‌ హ్యామ్‌ ప్యాలెస్‌ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. హ్యారీ దంపతులు తీసుకున్న ఈ నిర్ణయంపై ఇతర రాజకుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నట్లు ప్యాలెస్‌ అధికారులు ఆ ప్రకటనలోనే వెల్లడించారు. అంతేకాదు… భార్య కోసం ఇంతటి నిర్ణయం తీసుకోవడం చాలా గ్రేట్‌ అంటూ మరికొందరు కొనియాడారట.

Related posts