telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

అమరుల త్యాగమే..ఈ స్వాతంత్ర్యం

Indian flag

73 వసంతాల మన స్వతంత్ర్య భారతం . ,
ఎందరో వీరుల త్యాగ ఫలం . . !
రెపరెపలాడే మువ్వన్నెల జెండా నీడన . ,
స్మరిద్దాం భారతమాత ముద్దుబిడ్డల త్యాగ నిరతిని మనం . . !
మరిచి పోగలమా క్విట్ ఇండియా ఉద్యమాన్ని . ,
అహంసా వాదంతో ఆంగ్లేయులను వణికించి భారతావనిని ఏకతాటిపై నిలిపిన గాంధీజీని . . !
ఆజాద్ హిందు ఫౌజ్ దళాన్ని నిర్మించి శత్రువులకు సింహస్వప్నమైన నేతాజీని . .
సిస్తు రద్దు కోసం బ్రిటీస్ ప్రభుత్వంతో పోరాడిన వీర పాండ్య కట్టబ్రహ్మణని . . !
ఆంగ్లేయుల గుండెలపై బాణాలతో గర్జించన మన్యం వీరుడు అల్లూరిని . . !
స్వాతంత్ర్యం నాజన్మ హక్కు అని నినదించిన లోకమన్యుడిని
. ,
లాల్-బాల్-పాల్ త్రయాన్ని . . !
స్వరాజ్యం కోసం పోరాడిన ఝాన్సీ లక్ష్మీభాయ్ . ,
సరోజినీ నాయుడు వంటి వీర వనితలని . . !
ఎందరో వీరుల రక్తంతో తడిచిన ఈ భరత మాతని . ,
జాతీయ గీతం రచించిన రవీంద్రనాథ్ ఠాగూర్ . ,
జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య . ,
వందే మాతరం రచయిత బంకిం చంద్ర ఛటర్జీ . ,
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ . ,
మొదటి ప్రధాని నెహ్రూ . ,
తోలి రాష్ట్రపతి సర్వేపల్లి . ,
ఇలా ఎందరో మేధావులను . . !
స్వరాజ్యం కోసం కృషి చేసిన ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు . . !

Related posts