telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

జీలకర్ర వాడుతున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..!

జీలకర్ర అనేది ప్రతి ఇంటిలోనూ ఉంటుంది. ఇది కేవలం దినుసు మాత్రమే కాదు. దివ్య ఔషధి .
వేయించిన జీలకర్రని గాని నీళ్లతో కలిపి దంచి తీసిన రసం కాని మంచి సువాసనతో , మనసుకి , శరీరానికి ఎంతో ఇంపుగా , ఇష్టంగా ఉంటాయి. మంచి రుచి పుట్టిస్తాయి. వేడి పుట్టించి వాతాన్ని హరిస్తాయి .
జీలకర్ర ఉపయోగాలు:
1. జీలకర్రని క్రమం తప్పకుండా భోజన పదార్థాలలో గాని లేక ఔషదంగా గాని వాడుతుంటే కడుపులో జటర దీప్తి పెరుగుతుంది.
2. వీర్యవృద్ధి , బలము కలుగుతాయి.
3. ఎప్పుడు శరీర తత్వం గల వారికి దీనివల్ల సహజ ఉష్ణం కలుగుతుంది.
4. అన్ని రకాల పైత్యరోగాలను అణచడం లో జీలకర్రదే అగ్రస్థానం .
5. మీతిమీరిన కఫం , కఫవాతం , జ్వరాలు కడుపులో శూలలు , తలతిప్పడం , గ్యాస్ , అల్సర్ , రక్తంలో వేడి వీటన్నింటిని హరిస్తుంది .
6. మనం తినే రకరకాల ఆహార పదార్దాల ద్వారా మనశరీరంలో చేరే దుష్టద్రవాలను బయటకి పంపించి శరీరాన్ని కాపాడుతుంది

Related posts