telugu navyamedia
తెలంగాణ వార్తలు

జలవిహార్‌లో ఘ‌నంగా ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమం..

హైద‌రాబాద్‌ ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమం మొదలైంది. జలవిహార్‌లో అలయ్‌ బలయ్‌ సాంస్కృతిక కార్యక్రమాలను గవర్నర్‌ తమిళిసై ప్రారంభించారు.పార్టీలకు అతీతంగా నేతలంతా కలుసుకునే ఈ కార్యక్రమాని ఈసారి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

గత 16 ఏళ్ళుగా దసరా పండుగ తర్వాత దత్తాత్రేయ పార్టీలకు అతీతంగా నేతలంతా కలుసుకునే ఈ కార్యక్రమాని ఈసారి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే, తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సౌంద‌ర రాజ‌న్, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్, సినీన‌టుడు కోట శ్రీ‌నివాస‌రావు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మా అధ్య‌క్షుడు మంచు విష్ణు అలయ్ బలయ్‌ కార్యక్రమానికి వ‌చ్చారు.కార్యక్రమానికి హాజరైన ప్రముఖులకు దత్తాత్రేయ, కుటుంబసభ్యులు ఘన స్వాగతం పలికారు.

Governor Bandaru Dattatreya to inaugurate 'Alai Balai' today

తెలంగాణ సంస్కృతి కళ్లకు కట్టేలా అలయ్ బలయ్‌లో గిరిజన మహిళల నృత్యాలు, ఒగ్గు డోలు విన్యాసాలు, పెద్దపులుల వేసాలు, కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు , తెలంగాణ షడ్రుచుల వంటకాలు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచాయి. ఒకరినొకరు కలుసుకోవడం, ఆలింగనం చేసుకోవడం అలయ్ బలయ్ ప్రత్యేకత.

 అలయ్‌ బలయ్‌ కార్యక్రమం అద్భుతంగా ఉందని జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఇది ఎంతో స్ఫూర్తిదాయకమని, ఇలాంటి కార్యక్రమాలు ఉండాలని చెప్పారు.16 ఏళ్లుగా అలయ్-బలయ్ నిర్వహించడం గొప్ప విషయమని కొనియాడారు. పార్టీలకు అతీతంగా నిర్వహించడం సంతోషకరమని అభిప్రాయపడ్డారు. ఈ స్ఫూర్తిని ప్రతిఒక్కరూ కొనసాగించాలని పవన్‌ సూచించారు.

Related posts