telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విజయవాడ దుర్గమ్మ ఆలయంలో మరో ఘటన: గోరంట్ల ఆగ్రహం

gorantla buchayya on resignation

తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి వారి రథం దగ్ధం ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువిరుస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఘటన మరవకముందే మరో ఘటన చోటు చేసుకుందని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్విటర్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తూ వరుస ట్వీట్లు చేశారు.

అంతర్వేది ఘటన మరువక ముందే విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ఉన్న మహా మండపం వద్ద అమ్మవారి రథానికి ఉన్న నాలుగు వెండి సింహాలలో మూడు చోరీకి గురయ్యాయి. ఆ సంగతి ఎవరికీ తెలియకుండా వేరే కొత్త వెండి సింహాలు తయారుచేసే పనిలో అధికారులు ఉండడం దురదృష్టకరం. ఇలాంటివి తెలుగుదేశం తీవ్రస్థాయిలో ఖండిస్తుంది’ అని గోరంట్ల  అన్నారు.

Related posts