భర్తతో వివాహేతర సంబంధం సాగిస్తున్న ఓ మహిళకు, ఆమె కుమారుడికి భార్య నిప్పట్టించింది. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. సందీప్ గుప్తా అనే వ్యక్తి డాక్టర్. ఈయనకు భార్య సీమా గుప్తా, తల్లి లక్ష్మణ్ గౌర్ ఉన్నారు. అయితే సందీప్ ఆస్పత్రిలో దీపా దేవి అనే మహిళ రిసెప్షనిస్టుగా పని చేస్తుంది. ఈ క్రమంలో సందీప్, దీపా మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.
అయితే దీపాకు సందీప్.. బ్యూటీ పార్లర్ పెట్టించాడు. అంతేకాకుండా ఆమెకు వసతి గృహం తన సొంతడబ్బులతో ఏర్పాటు చేయించాడు డాక్టర్. ఈ విషయం భార్య సీమా, తల్లి గౌర్‌కు తెలిసింది. దీంతో దీపా నివాసముంటున్న ఇంటికెళ్లిన సీమా, లక్ష్మణ్ గౌర్.. ఇంటి బయట నుంచి లోపలికి కొన్ని రసాయనాలు చల్లి నిప్పంటించారు. దీంతో ఇంట్లో ఉన్న దీపా, ఆమె కుమారుడు సజీవదహనం అయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.