telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

25 ఏళ్లకే ఎంపీగా ఎన్నికైన మాధవి.. లోక్‌సభ చరిత్రలో రికార్డు!

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ జిల్లా అరకు లోక్‌సభ నియోజకవర్గం నుంచి గొడ్డేటి మాధవి(25) భారీ మెజార్టీతో విజయం సాధించారు. వైఎస్సార్‌సీపీ తరపున పోటీ చేసిన మాధవి సమీప ప్రత్యర్థి కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్‌పై 2,21,058 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈమె వయసు ప్రస్తుతం 25 ఏళ్ల 3 నెలలు. ఇంత చిన్న వయసులో ఎంపీగా గెలుపొంది రికార్డు సృష్టించారు. గతంలో ఈ రికార్డు 26 ఏళ్ల 13 రోజుల దుష్యంత్ చౌతాలాపై ఉండేది. అతి పిన్న వయసులోనే ఎంపీగా గెలుపొందిన మాధవి.. అరుదైన రికార్డు సొంతం చేసుకుంది.

చింతపల్లి మాజీ ఎమ్మెల్యే, సీపీఐ సీనియర్ నాయకులు గొడ్డేటి దేముడు కుమార్తె మాధవి బీఎస్సీ, బీపీఎడ్ చదివారు. కొయ్యూరులోని గిరిజన సంక్షేమ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ ఆరు నెలల క్రితం జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా వైసీపీలో చేరి రాజకీయ అరంగేట్రం చేశారు. తమలోని ఒకరిగా భావించిన గిరిజనులు ఆమెను భారీ మెజారిటీతో గెలిపించారు. 1992లో జన్మించిన మాధవి అవివాహితురాలు.

Related posts