telugu navyamedia
రాజకీయ

కాంగ్రెస్‌కు బిగ్ షాక్..​ పార్టీకి గులాం నబీ ఆజాద్ గుడ్​బై..రాహుల్‌పై ఫైర్‌

*కాంగ్రెస్​ పార్టీకి గులాం నబీ ఆజాద్ గుడ్​బై..
*సోనియా ఐదు పేజీల లేఖను రాసిన గులాం నబీ ఆజాద్..
*కొంత‌కాలంగా పార్టీ అధినాయ‌కత్వంపై అసంతృప్తి..

*50 ఏళ్ల కాంగ్రెస్ బంధాన్ని తెంచుకోవడం బాధేస్తుంంది

కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులామ్‌ నబీ ఆజాద్ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీకి చెందిన అన్ని పదవులకు రాజీనామా చేశారు

ఈమేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఐదు పేజీల లేఖను రాశారు. అగ్రనేత రాహుల్​ గాంధీ వ్యవహార శైలి సహా పార్టీ పనిచేసే తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు ఆజాద్.

రాహుల్ వైస్ ప్రెసిడెంట్ అయ్యాక పార్టీ నాశనమైందని పేర్కొన్నారు. పార్టీలో ప్రస్తుతం సంప్రదింపుల ప్రక్రియ లేకుండా పోయిందన్నారు. సీనియర్లందరినీ రాహుల్ పక్కన పెట్టారంటూ ఆవేదన వ్యక్తంచేశారు.

రాహుల్ గాంధీది చిన్న పిల్లల మనస్తత్వం అని, ఈ పరిస్థితికి రాహుల్ కారణమని పేర్కొన్నారు. 50 ఏళ్ల కాంగ్రెస్ బంధాన్ని తెంచుకోవడం బాధేస్తుందంటూ ఆజాద్ పేర్కొన్నారు.

గులాం నబీ ఆజాద్.. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా పలు పదవుల్లో పనిచేశారు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో గులాం నబీ ఆజాద్ పాత్ర కీలకం. ఆనాడు గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీగా పని చేశారు

పార్టీలో సంస్కరణ తేవాలంటూ గొంతెత్తిన జీ23 నేతల్లో.. ఆజాద్ ఒకరు. ఆజాద్ రాజ్యసభ పదవీకాలం గతేడాది ముగియగా ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనను పెద్దల సభకు పంపలేదు. చాలాకాలంగా కాంగ్రెస్​కు అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు ఆజాద్.

అయితే.. ఇటీవల జమ్ముకశ్మీర్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా సోనియా గాంధీ అప్పగించిన బాధ్యతలను ఆయన తిరస్కరించారు.

జమ్ముకశ్మీర్‌లో కాంగ్రెస్ పార్టీని పునర్వవస్థీకరించే చర్యల్లో భాగంగా నియా గాంధీ గులాం నబీ ఆజాద్‌ను ప్రచార కమిటీ ఛైర్మన్‌గా నియమించారు. ఆజాద్ సన్నిహితుడైన వికార్ రసూల్‌ వానీని జమ్మూ కశ్మీర్ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా నియమించారు.

అయితే నియమించిన కొద్ది సేపటికే ఆఫర్‌ను ఆజాద్‌ తిరస్కరించారు. ఆరోగ్య కారణాలతో ఆజాద్‌ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా ఉండటానికి నిరాకరించారని ఈ విషయాన్ని అధిష్ఠానానికి తెలియజేశారని కాంగ్రెస్ వర్గాలు అప్పట్లో చెప్పాయి. ఇదంతా జరిగిన పది రోజులకే కాంగ్రెస్​తో పూర్తిగా తెగదెంపులు చేసుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించారు ఆజాద్.

Related posts