telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వ్యాపార వార్తలు

జీఎస్టీ లో బయటపడుతున్న లొసుగులు.. వెయ్యి కోట్లకు నకిలీ ..

fake claims in gst found and investigating

టాస్క్‌ఫోర్స్‌ అధికారులు, ఎగుమతుల పరంగా జీఎస్టీ రాయితీలను అక్రమంగా లబ్దిపొందుతున్నట్లు గుర్తించారు. మొత్తం 5106 మంది సమస్యాత్మక ఎగుమతిదారులు తమతమ క్లెయింలు అక్రమంగా చేసి రీఫండ్స్‌ పొందుతున్నట్లు కేంద్రం గుర్తించింది. సమీకృత జీఎస్టీ రీఫండ్స్‌లో ఎగుమతిదారులు సుమారు 1000 కోట్లవరకూ లబ్దిపొందినట్లు తేలింది. మొత్తం 5106 మంది ఎగుమతిదారులు ఈ అవకతవకలకు పాల్పడినట్లు ప్రభుత్వం వెల్లడించింది. బోగస్‌ ఇన్వాయిస్‌లను దాకలుచేసి జీఎస్టీ రీఫండ్‌లు పొందారని గుర్తించింది.

కేంద్ర పరోక్షపన్నులబోర్డు కస్టమ్స్‌ బోర్డు సహేతుకమైన ఎగుమతిదారులకే రీఫండ్‌ క్లెయింలు వెళతాయని, ఆటోమేటెడ్‌ యంత్రాంగంలో వాటిని ప్రాసెస్‌చేయడం జరుగుతుందని వీటిని సమయానుకూలంగా రీఫండ్‌ ఇవ్వడంజరుగుతుందని వెల్లడించింది. సిబిఐసి కస్టమ్స్‌, జీఎస్టీ అధికారులకు ఈ ఎగవేత, బోగస్‌ క్లెయింలపై అప్రమత్తంచేస్తూ ఇన్‌పుట్‌ట్యాక్స్‌క్రెడిట్‌ను కొందరు ఎగుమతిదారులు అక్రమ మార్గాల్లో లబ్దిపొందుతున్నారనిచ వెంటనే కార్యాచరణ షురూచేయాలని సూచించింది. మొత్తం 5106మంది సమస్యాత్మక ఎగుమతిదారులను సైతం గుర్తించి ఆయా సర్కిళ్లకు పంపించింది. సుమారు 1.42 లక్షలమంది దేశంలో ఎగుమతిదారులు రీఫండ్‌ క్లెయిలు చేస్తుంటే వీరిలో ఐదువేలకుపైగా బోగస్‌ క్లెయిమ్‌లు చేస్తున్నట్లు తేలింది. బోగస్‌ క్లెయిమ్‌లు చేసినా వీరి ఎగుమతులను అనుమతిస్తూ వచ్చారు.

ఇక నుండి తనిఖీ విధానం ఎగుమతిదారులు ప్రభుత్వ సొమ్మును బోగస్‌ క్లెయిమ్‌లద్వారా సాధించేందుకు వీలులేని విధంగా జరుగుతుందని వెల్లడించింది. సిబిఐసి సిస్టమ్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ వెంటనే ఇలాంటి సమస్యాత్మక ఎగుమతిదారులను గుర్తించి వారివివరాలను కేంద్రపన్నులవిభాగం చీఫ్‌ కమిషనర్‌కు పంపించాలని, అంతకుముందు జరిగిన ఐజీఎస్టీ రీఫండ్స్‌ను కూడా పరిశీలించాలని ఆదేశించింది. కస్టమ్స్‌శాఖలో ఉన్న నష్టనివారణ కేంద్రం(ఆర్‌ఎంసిసి) ఎప్పటికప్పుడు ఈ రిస్క్‌ ఎగుమతిదారులగురించి హెచ్చరికలుచేస్తుందని, వీరి ఎగుమతులను నూరుశాతంప రిశీలించాలని ఆదేశించింది. అవసరమైతే ఐజీఎస్టీ రీఫండ్‌లను సైతం నిలిపివేసేందుకు హెచ్చరికలు జారీచేస్తుందని సిబిఐసి వివరించింది. ఎగుమతిదారులు ఐజీఎస్టీ రీఫండ్స్‌ను రెండుమార్గాల్లో క్లెయిమ్‌ చేస్తారు. బాండ్‌ లేదా ఎల్‌ఒయుల సాయంతో చేసుకుంటారు. ఎగుమతుల సమయంలోనే వీటిని పూర్తిచేస్తారు. అంతేకాకుండా పేరుకుపోతున్న ఐటిసి అంటే ఇన్‌పుట్‌ట్యాక్స్‌ క్రెడిట్‌ను రీఫండ్‌చేయాలని కోరతారు.

Related posts