*విశాఖలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
*పార్లే ఫర్ ది ఓషన్స్ సంస్థతో ఒప్పందం
*అతిపెద్ద బీచ్ క్లీనింగ్ కార్యక్రమం జరిగింది
*76 టన్నుల ప్లాస్టిక్ తొలగించారు…
*తీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది
*ఇవాళ్టి నుంచి ఆంద్ర రాష్ర్టంలో ప్లాస్టిక్ బ్యానర్స్ రద్దు
*ఇకపై రాష్ట్రంలో బట్టతో తయారుచేసిన బ్యానర్సే పెట్టాలి..
ఏపీలో ప్లాసిక్ ఫ్లెక్సీలను పూర్తిగా నిషేధిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇకపై రాష్ట్రంలో ఫ్లెక్సీలు పెట్టాలంటే ప్లాస్టిక్ ఫ్లెక్సీలు పెట్టకూడదని, కాస్త రేటు ఎక్కువైనా గుడ్డతో తయారుచేసినవే పెట్టాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు.
నేడు విశాఖపట్నంలో ప్రపంచలోనే అతిపెద్ద బీచ్ క్లీనింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్‌లో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేదికపై సీఎం మాట్లాడుతూ.. ఇవాళ విశాఖలో ప్రపంచంలోనే అతిపెద్ద బీచ్ క్లీనింగ్ కార్యక్రమం జరిగిందని సీఎం జగన్ చెప్పారు.
ఇవాళ ఒక్కరోజే ఉదయం కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి వరకూ 76 టన్నుల ప్లాస్టిక్‌ను సముద్రం నుంచి తొలగించారని సీఎం జగన్ అన్నారు. పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక పురోగతి అనేవి నాణేనికి రెండు వైపులు అని జగన్ అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే ఆర్థిక పురోగతి సాధించాలని అన్నారు.
భూమిపై 70 శాతం ఆక్సిజన్ సముద్రం నుంచే వస్తోంది. అందుకే సముద్రాన్ని కాపాడుకోవాలి. అలాగే ఏపీ తీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులందరిదీ అని ఆయన పిలుపు ఇచ్చారు.
ఈ సందర్భంగా సముద్రతీర స్వచ్ఛత, ప్టాస్టిక్ రహిత నదీ జలాల అంశంపై పార్లే ఫర్ ది ఓషన్ సంస్థతో ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. సీఎం జగన్ సమక్షంలో పార్లే ఫర్ ది ఓషన్ సంస్థతో ఈ ఎంవోయూ కుదిరింది.