telugu navyamedia
రాజకీయ వార్తలు

చైనా వాస్తవాలు చెప్పడం లేదు..డ్రాగన్ దేశంపై ట్రంప్ నిప్పులు

trump usa

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై మరోసారి నిప్పులు చెరిగారు. కరోనా వైరస్ వ్యాప్తిపై వాస్తవాలు దాచి, తీవ్ర జనహననానికి కారణమవుతోందంటూ మండిపడ్డారు. వైట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలియక చేస్తే క్షమిస్తామని, తెలిసి చేసిందని వెల్లడైతే మాత్రం తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. అంతేకాదు, కరోనా మరణాలపై చైనా తాజాగా సవరణ చేసిందని, దాంతో చైనాలో మృతుల సంఖ్య 4600 అయిందని తెలిపారు.

చైనా తీరు చూస్తుంటే ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని అన్నారు. ఆ లెక్కన కరోనా మరణాల్లో అమెరికా నంబర్ వన్ అని భావించడంలేదని, చైనానే నంబర్ వన్ అని వ్యాఖ్యానించారు. మరణాల సంఖ్య పరంగా అమెరికా కంటే చైనా ఎంతో ముందుంటుందన్నారు. చైనా చెబుతున్న మరణాల సంఖ్య మొదటి నుంచి నమ్మశక్యంగా లేదని మండిపడ్డారు. చైనా అధికారిక గణాంకాలకు వాస్తవాలకు తేడా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. 

Related posts