telugu navyamedia
సినిమా వార్తలు

ధనుష్ సినిమాకు ఇబ్బందులు

Dhanush-1

ప్రముఖ తమిళ హీరో ధనుష్ కు ఊహించని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తమిళ స్టార్ హీరో ధనుష్ నటీనటులను ఇబ్బందుల పాలు చేస్తున్నారని, మోసం చేస్తున్నారని నిర్మాతలపై చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పుడు అతని సినిమా విడుదల కావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. కోలీవుడ్ లో ధనుష్ ఎలాంటి సినిమా చేసినా క్రేజ్ ఓ రేంజ్ లో ఉంటుంది. కానీ ఈ సారి సూపర్ స్టార్ అల్లుడి సినిమాపై హైప్ ఏ మాత్రం లేదు. ఆ సినిమా మరేదో కాదు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన “ఎనై నోకి పాయం తోట”. తెలుగులో తూటా అనే టైటిల్ ని సెట్ చేశారు. అయితే సినిమా పూర్తయ్యి నెలలు గడుస్తున్నా విడుదలకు నోచుకోవడం లేదు. ఎట్టకేలకు సెప్టెంబర్ 6న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుందని ఇటీవల చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. కానీ ఆర్థిక కారణాల వల్ల సినిమా మరోసారి వాయిదా పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఒకరోజు ఆలస్యమయినా సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. మరి ధనుష్ నిర్మాతలపై చేసిన వ్యాఖ్యలు సినిమాపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది చూడాలి.

Related posts