telugu navyamedia
సినిమా వార్తలు

థాయ్‌లాండ్‌లో బాలయ్య 105వ సినిమా ప్రారంభం

no more movies in near future by balakrishna

నట సింహం నందమూరి బాలకృష్ణ 105వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ థాయ్‌లాండ్‌లో ఈరోజు నుండి ప్రారంభమైంది. హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మాతగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. భూమిక చావ్లా, ప్రకాశ్ రాజ్, జయసుధ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. థాయ్‌లాండ్‌లో జరుగుతున్న ఈ భారీ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సినిమాలోని నటీనటులందరూ ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. `జైసింహా` వంటి సూపర్‌హిట్ చిత్రం తర్వాత బాలక‌ృష్ణ, సి.కల్యాణ్ కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంతన్ భట్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి రామ్‌ప్రసాద్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. పరుచూరి మురళి కథను అందిస్తున్నారు.

Related posts