telugu navyamedia
సినిమా వార్తలు

వైరల్ : హీరో హీరోయిన్ల లిప్ లాక్ లీక్

Video Leaked from The Set of Kabir Singh

టాలీవుడ్ లో విజయ్ దేవరకొండను ఓవర్ నైట్ స్టార్ గా మార్చిన “అర్జున్ రెడ్డి” సినిమాను హిందీ, తమిళ భాషల్లో రూపొందిస్తున్న విషయం తెలిసిందే. హిందీలో షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా “కబీర్ సింగ్” పేరుతో ఈ చిత్రం రూపొందుతోంది. తెలుగులో “అర్జున్ రెడ్డి”కి దర్శకత్వంలో వహించిన దర్శకుడు సందీప్ వంగా హిందీ రీమేక్ ను కూడా తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా సినిమాకు సంబంధించిన ఓ లిప్ లాక్ సీన్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమై చిత్రబృందానికి షాక్ ఇచ్చింది. ఇటీవల ఢిల్లీలో కిరోరీ మాల్ కాలేజ్ లో చిత్రబృందం ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న కొంతమంది స్టూడెంట్స్ ఆ సన్నివేశాన్ని తమ ఫోన్లలో బంధించారు. ఆ తరువాత వాటిని తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేయడంతో ఈ లిప్ లాక్ సీన్ వైరల్ గా మారింది. అంతేకాదు ఫ్రీగా సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ కూడా అవుతోంది.

 

View this post on Instagram

 

Kirorimal college #kabir singh

A post shared by Happy_Club_KMC😎 (@happy_club_kmc) on

Related posts