telugu navyamedia
సినిమా వార్తలు

మరోసారి మామ కాబోతున్న సల్మాన్

బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్ర‌స్తుతం ద‌బాంగ్ 3 చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు స‌ల్మాన్. త్వ‌ర‌లోనే చిత్ర షూటింగ్‌ని పూర్తి చేసి ఈద్ కానుక‌గా చిత్రాన్ని విడుద‌ల చేయనున్నారు. ఆయన సోదరి అర్పిత ఖాన్ 2014లో అయూష్‌ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. హైద‌రాబాద్‌లోని ఫలక్‌నూమా ప్యాలెస్‌లో వీరి వివాహం ఘ‌నంగా జ‌రిగింది. ప్ర‌స్తుతం వారికి అహిల్ అనే కుమారుడు ఉన్నాడు. త్వ‌ర‌లో అర్పిత ఖాన్ మ‌రో బేబీకి జ‌న్మ‌నివ్వ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. బంద్రా హాస్పిట‌ల్‌లో రెగ్యుల‌ర్ చెక‌ప్ కోసం అర్పిత వెళుతుండ‌గా, మీడియా ఈ విష‌యాన్ని గ‌మ‌నించింది. స‌ల్మాన్ మ‌రోసారి మామ కాబోతున్నాడంటూ బాలీవుడ్ మీడియా ప్ర‌చారం చేస్తుంది. ఇప్ప‌టికే ఈ శుభ‌వార్త‌ని అర్పిత త‌న అన్న‌కి చేర‌వేయ‌గా, ఆయ‌న చాలా సంతోషించార‌ట‌.

Related posts