telugu navyamedia
రాజకీయ

విద్యార్థినిని బెదిరించిన కాంగ్రెస్ స్టూడెంట్‌ లీడర్ 

MLA Upender Reddy Join shortly TRS
ఓ కాంగ్రెస్ స్టూడెంట్‌ లీడర్ జూనియర్‌ విద్యార్థినితో గొడవకు దిగాడు. ఇప్పుడు నువ్వు ఫస్టియర్‌ చదువుతున్నావ్‌.. ఇంకో మూడేళ్లు ఇదే కాలేజీలో చదవాలి.. జర భద్రం’ అంటూ ఓ విద్యార్థినిని బెదిరించే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో  వైరల్‌ అవుతోంది. వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షాజహాన్‌పూర్‌  జిల్లా ఎన్‌ఎస్‌యూఐ ప్రెసిడెంట్‌ ఇర్ఫాన్‌ హుస్సేన్ కాలేజీలో జూనియర్‌ విద్యార్థినితో తగదా పడ్డాడు.  సదరు బాలికతో.. ‘అందంగా ఉన్నావ్‌.. కాస్తా హద్దుల్లో ఉంటే మంచిది. నేను తల్చుకుంటే నిన్ను కాలేజీలో అడుగుపెట్టకుండా చేయగలను. బీ కేర్‌ ఫుల్‌’ అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. 
అయితే ఇంత జరుగుతుంటే అధ్యాపకులేవ్వరు ఈ గొడవను ఆపే ప్రయత్నం చేయలేదు. మిగతా స్టూడెంట్స్‌ వీడియోలు తీయడంలో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడయో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. దాంతో కాంగ్రెస్‌ స్టూడెంట్‌ బాడీ హుస్సేన్‌ను సస్పెండ్‌ చేయడమే కాక ఆర్గనైజేషన్‌ నిర్వహించే ఏ కార్యక్రమాల్లో కూడా పాల్గొనకూడదంటూ ఉత్తర్వులు జారీ చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts