telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సోనూసూద్ కు కరోనా పాజిటివ్

Sonu-Sood

కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ లో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఎంతో మందికి సహాయం చేసి దేవుడు అయ్యాడు. ఆ కష్ట కాలంలో సోనూ సూద్ చేసిని సహాయం మరువలేనిది. ఎందరో వలస కార్మికులను ఇల్లకు చేర్చారు. విదేశాలలో చిక్కుపోయిన వారిని స్వదేశానికి రప్పించారు. ఇలా లాక్‌డౌన్ సమయంలో మొదలు పెట్టిన సహాయాన్ని సోనూసూర్ కొనసాగిస్తూనే ఉన్నారు. సహాయం కోరుతు తన వద్దకు చేరిన వారికి లేదనకుండా చేయూతనిస్తున్నారు. అయితే తాజాగా సోనూసూద్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. “నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలు ఉన్నాయి. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాను. ఇటీవల కాలంలో నన్ను కలిసిన వారు క్వారంటైన్‌లో ఉండాలి. కరోనా పరీక్షలు చేయించుకోవాలి” అని సోనూసూద్ కోరారు.

Related posts