telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

గాంధీ ఆసుపత్రిలో అందరికీ ఒకే మెను!

karona ward in gandhi hospital

తెలంగాణలో కరోనా చికిత్సా కేంద్రంగా ఉన్న హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో డైట్ ను మార్చారు. కరోనా రోగుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వారికి పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు మెను న మార్చారు. ఉదయం టిఫిన్ నుంచి రాత్రి డిన్నర్ వరకూ పోషక విలువలతో కూడిన ఆహారాన్ని డిస్పోజబుల్ పాత్రల్లో మాత్రమే అందించాలని ఆసుపత్రి వర్గాలు నిర్ణయించాయి.

ఇక, డైట్ గా ఏమిస్తున్నారన్న విషయాన్ని పరిశీలిస్తే, ఉదయం ఏడున్నర నుంచి ఎనిమిది గంటల మధ్య అల్పాహారంగా ఇడ్లి, పూరి, బొండా, ఉప్మా, ఊతప్పం లలో ఏదో ఒకదానితో పాటు పాలు అందిస్తారు. ఆపై 10 గంటలకు బిస్కెట్లతో పాటు టీ లేదా కాఫీ ఇస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య అన్నం, పప్పు, సాంబారు, పెరుగు, కోడిగుడ్డు, అరటిపండు, కూర, మినరల్ వాటర్ బాటిల్ ను ఇస్తారు. ఇక ఆసుపత్రిలోని వైద్యులు, పారిశుద్థ్య సిబ్బంది, వార్డు బాయ్స్, నర్సులకు కూడా ఇదే డైట్ ను ఇస్తారు.

Related posts