telugu navyamedia
క్రీడలు

ఘనంగా స్పెషల్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ లు ప్రారంభం

జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు 37 రోజుల పాటు సమ్మర్ కోచింగ్ క్యాంప్ లు నిర్వహిస్తున్నామని అడిషనల్ కమిషనర్ స్పోర్ట్స్ విజయలక్ష్మి తెలిపారు. ఖైరతాబాద్ విక్టరీ ప్లే గ్రౌండ్ లో మంగళవారం సమ్మర్ కోచింగ్ క్యాంప్-2023 బేగంబజార్  కార్పొరేటర్ శంకర్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు.
క్యాంపులలో 44 రకాల క్రీడలలో 915 సెంటర్లలో ఉదయం 6:15 గంటల నుండి 8:15 గంటల వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణను 6 సంవత్సరాల నుండి 16 సంవత్సరాలలోపు పిల్లలకు జిహెచ్ఎంసి పరిధిలో వివిధ ప్లే గ్రౌండ్ లలో నిర్వహించడం జరుగుతుంది.  77 మంది పార్ట్ టైమ్ కోచ్ లు మరియు 712 హానర్ రోరియం కోచ్ లు ఉన్నట్లు తెలిపారు. స్పోర్ట్స్ కోచ్ క్యాంపులలో రిజిస్ట్రేషన్ కోసం 50 రూపాయల ఫీజు షటిల్ బ్యాడ్మింటన్, రోలర్, స్కేటింగ్, క్రికెట్, టెన్నిస్ ఇతర గేమ్ లకు రూపాయలు రూ.10  ఆన్లైన్లో www.sports.ghmc.gov.in నమోదు చేసుకోవాలని అన్నారు. అన్ని జోన్లలో  ఏడుగురు గేమ్స్ ఇన్స్పెక్టర్లు ఉన్నట్లు తెలిపారు.
ఖైరతాబాద్ విక్టరీ ప్లే గ్రౌండ్ లో ఏర్పాటైన సమ్మర్ కోచింగ్ క్యాంప్ లో కోచ్ లు ముఖాముఖి పరిచయం, మార్చ్ ఫాస్ట్ తో ఎన్.సి.సి, క్రికెట్, బాస్కెట్బాల్, స్కేటింగ్, రోలర్, కరాటే, కోకో,  జిమ్నాస్టిక్స్, వాషు, బ్యాడ్మింటన్, ఫెన్సింగ్, హాకీ ,రెజ్లింగ్, టైకుండో, హ్యాండ్ బాల్, సపక్ తక్రా, స్కై మార్షల్ వాలీబాల్ ప్రారంభోత్సవం చేశారు. బేగం బజార్ కార్పొరేటర్ శంకర్ యాదవ్ మాట్లాడుతూ… కోచ్ హానరోరియం పెంచడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. సందర్భంగా  మార్చ్ ఫాస్ట్ మొదటి ప్రైజ్ అమీర్ పేట్, రెండో ప్రైజ్ మల్కం, మూడో ప్రైజ్ విక్టరీ ప్లే గ్రౌండ్  అందజేశారు. కోచ్ లకు  స్పోర్ట్స్ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన విద్యార్థుల జిమ్నాస్టిక్స్ మరియు నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.
సమావేశంలో స్పోర్ట్స్ డైరెక్టర్ భాష, మంగళ హాట్ కార్పొరేటర్ కృష్ణ శశికళ, డిప్యూటీ కమిషనర్ నాయక్, ఆలీ, మోహన్ రెడ్డి, గేమ్స్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి, మహ్మద్ రఫీ అలీ, ఇంతియాజ్ అహ్మద్ మాధవి, వీరానంద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related posts