ఐపీఎల్ 2020 ముగిసిన తర్వాత నేరుగా ఆసీస్ పర్యటనకు వెళ్ళింది భారత జట్టు. అయితే ఈ ఆస్ట్రేలియా పర్యటనలో సత్తాచాటిన భారత యువ క్రికెటర్లకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తమ సంస్థకు చెందిన ఎస్‌యూవీ థార్ వాహనాలను బహుమతిగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ వాహనాలను అందుకున్న భారత ఆటగాళ్లు ఆనంద్ మహీంద్రాకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. టీమిండియా యంగ్ సెన్సేషన్, తమిళనాడు క్రికెటర్ నటరాజన్.. తన అరంగేట్ర టెస్ట్ జెర్సీని రిటర్న్ గిఫ్ట్‌గా పంపించి థ్యాంక్స్ చెబితే.. తాజాగా శార్దూల్ కూడా ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపాడు. ఇక తాజాగా ఎస్‌యూవీ థార్ వాహనాల ముందు నిలబడి ఫోజిచ్చిన ఫొటోలను ఠాకూర్ పంచుకున్నాడు. ‘మహీంద్రా జీ.. మీరు పంపిన థార్ ఎస్‌యూవీ ఇప్పుడే వచ్చింది. మీరిచ్చిన గిఫ్ట్ కంటే మాపై మీరు చూపించిన ప్రేమ వెలకట్టలేనిది. నాకు ఇష్టమైన ఎస్‌యూవీ కారును గిఫ్ట్‌గా పంపారు.. దీనిని నడపుతుంటే తెలియని ఫీలింగ్ కలుగుతుంది. అయితే నటరాజన్, శార్దూల్‌తో పాటు మహీంద్ర థార్ వాహనాలను సుందర్, మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్, నవదీప్ సైనీలు కూడా అందుకున్నారు.
ఎస్సీ వర్గీకరణపై వ్యాఖ్యలను జగన్ వెనక్కి తీసుకోవాలి: మంద కృష్ణ