ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారి టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్న భారత మహిళల జట్టుకు మెన్స్ టీమ్ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే బ్యాటింగ్ టిప్స్ ఇచ్చాడు. మహిళల టీమ్ హెడ్ కోచ్ రమేశ్ పోవార్ విజ్ఞప్తి మేరకు రహానే ఓ సెషన్‌లో మహిళా బ్యాటర్స్‌తో ఇంటరాక్ట్ అయ్యాడు. రెండు టీమ్స్ ఇంగ్లండ్ బయల్దేరే ముందే ఈ సెషన్ జరిగింది. 73 టెస్ట్‌ల అనుభవం ఉన్న రహానేకు ఇంగ్లండ్‌లో పరిస్తితులపై బాగా అవగాహన ఉంది. ఈ క్రమంలో మిథాలీ అండ్ కోకు తను కీలక సూచనలు చేశాడు. ‘రెండు టీమ్స్ ముంబైలో క్వారంటైన్‌లో ఉన్న టైమ్‌లో 50 నిమిషాల జూమ్ సెషన్ ఏర్పాటు చేశారు. యూకేలో బాల్ ఎక్కువగా మూవ్ అవుతుంది కాబట్టి ఇన్నింగ్స్ ప్రారంభంలో ఎక్కువ డ్రైవ్ చేయకూడదని రహానే వారికి సూచించాడు. వీలైనంత మేరకు బాల్‌ను బాడీకి క్లోజ్‌గా ఆడమని చెప్పాడు. లేట్ స్వింగ్ ఉన్నప్పుడు కవర్ డ్రైవ్ చేయాలని అనిపిస్తుంది. కానీ మొదట్లోనే స్ట్రోక్స్‌కు వెళ్లొద్దన్నాడు. అలాగే ముందుగానే మెయిన్ టార్గెట్‌పై ఫోకస్ చేయకుండా.. చిన్న చిన్న టార్గెట్లు పెట్టుకొని టెస్ట్ ఇన్నింగ్స్‌ను నిర్మించాలని చెప్పాడు. రెయిన్ బ్రేక్స్ తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలన్నాడు. ఇక, లాంగ్ పార్ట్‌నర్‌షిప్ చేసిన తర్వాత బ్యాటర్ల మైండ్ సెట్ ఎలా ఉండాలంటూ హర్మన్ ఆసక్తికరమైన ప్రశ్న అడిగింది. పార్టనర్‌షిప్ కొనసాగుతున్నప్పుడు ప్లేయర్లు తమ ఆలోచనలను నియంత్రణలో ఉంచుకోవాల్సి ఉంటుందని రహానే చెప్పాడు. ఆట ముగిసిన తర్వాత పార్ట్‌నర్‌షిప్ గురించి అస్సలు ఆలోచించకుండా.. మళ్లీ గ్రౌండ్‌లోకి రాగానే దానిపై ఫోకస్ పెట్టాలని సూచించాడు.’అని టీమ్ వర్గాలు పేర్కొన్నాయి.
previous post