నేడు హైదరాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను నిర్వహించనున్నారు అధికారులు. అందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కేవలం సభ్యులను మాత్రమే కౌన్సిల్ హాల్‌లోకి అనుమతించనున్నారు. సభ్యులు తప్పని సరిగా కోవిడ్ నిబంధనలను పాటిస్తు మాస్క్‌లను ధరించాలని సూచించారు. మొత్తం 193 మంది సభ్యుల్లో 97 మంది సభ్యులు హాజరై.. కోరం ఉంటే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహిస్తారు. లేకుంటే శుక్రవారానికి వాయిదా వేస్తారు. అయితే బల్దియాలో ఏ పార్టీకి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు స్పష్టమైన మేజార్టీ లేకపోవడంతో ఎన్నికై ఉత్కంఠ సాగుతోంది. ఇక టీఆర్ ఎస్ నుండి హైదరాబాద్ మేయర్ అభ్యర్థిగా హైదరాబాద్ టీఆర్‌ఎస్ మేయర్ అభ్యర్థిగా ఖరారైన గద్వాల విజయలక్ష్మి సీనియర్ ఎంపీ కేకే కూతురు. బంజారాహిల్స్ కార్పొరేటర్ గా రెండోసారి ఆమె విజయం సాధించారు. జర్నలిజం బీఏ, ఎల్‌ఎల్‌బీ చదివారు. అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీలో పరిశోధన సహాయకురాలు పనిచేశారు. 2007లోస్వదేశం తిరిగొచ్చారు. రాజకీయాల్లో చేరేందుకు నిర్ణయించుకున్న ఆమె అమెరికా పౌరసత్వం వదులుకున్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన గద్వాల విజయలక్ష్మి బాబీరెడ్డిని పెళ్లి చేసుకున్నారు.
previous post
next post
తన ఆరోగ్యంపై అమితాబ్ షాకింగ్ కామెంట్స్