ఫోక్స్‌వేగన్ మార్కెట్లోకి సరికొత్త మోడల్స్‌ను విడుదల చేసింది. పోలో, వెంటో 2019 ఎడిషన్లను నేడు మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఫోలో ఫేస్‌లిఫ్ట్ ఎడిషన్ ఎక్స్ షోరూమ్ ధర రూ.5.82 లక్షల వద్ద మొదలు కాగా.. వెంటో ధర రూ.8.76లక్షల వద్ద మొదలవుతుంది. ఈ కార్లలో సరికొత్త ఫీచర్లను జతచేయడంతోపాటు సన్‌సెట్ రెడ్ రంగును కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. పోలో కారులో గ్రిల్స్‌ల్లో స్వల్పమార్పులు చేశారు.
కొత్త మోడల్స్‌లో 10స్పోక్ అలాయ్ వీల్స్ ఆప్షన్‌ను కూడా ఇచ్చారు. పోలోలో సరికొత్త స్పాయిలర్‌ను అమర్చారు. వెంటలో పూర్తి ఎల్‌ఈడీ లైట్లను అమర్చారు. బంపర్ డిజైన్లలో మార్పులు చేశారు. ఈ కారులో కూడా పోలో వలే మల్టీ స్పోక్ అలాయ్ వీల్స్‌ను అమర్చారు. రెండు కార్లలో డీజిల్ వేరియంట్లకు 5ఏళ్ల వారెంటీ, పెట్రోల్ వేరియంట్లకు 4ఏళ్ల వారెంటీ ఇచ్చారు. దీనిని అవసరాన్ని బట్టి 7ఏళ్ల వరకు పెంచుకోవచ్చు.
తెలుగు రాష్ట్రాల ప్రజలు మాట్లాడుకోలేని పరిస్థితి: చంద్రబాబు