telugu navyamedia
వార్తలు సామాజిక

కరోనాకు వ్యాక్సిన్‌ ఇప్పట్లో తయారు కాదు: డేవిడ్‌ నబారో

Corona

రెండుమూడు నెలల్లో కరోనా వ్యాక్సిన్ వస్తుందని చాలా దేశాలు చెప్తున్నాయి. కానీ, అందులో నిజం లేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ శాస్త్రవేత్త డేవిడ్ నబారో పేర్కొన్నారు. కరోనా కు వ్యాక్సిన్‌ కనుగొనడం ఇప్పటికిప్పుడు వస్తుంది అనుకోవడంలో నిజం లేదని అన్నారు. కరోనా కు వ్యాక్సిన్ తయారు కావాలి అంటే చాలా దశలు పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు.

మొదటి దశలో వ్యాక్సిన్ ను మనిషికి ఇస్తే ఏదైనా ప్రమాదకరమా అని చూస్తారు. ఆ తరువాత వ్యాక్సిన్ వైరస్‌ని చంపుతుందా లేదా అన్నది గమనిస్తారు. మూడో దశలో వ్యాక్సిన్ వల్ల మనిషికి దీర్ఘకాలిక సమస్యలేమైనా వస్తాయా అని, నాలుగో దశలో వ్యాక్సిన్ ఇస్తే, ఆ వ్యక్తికి ఆల్రెడీ ఉన్న జబ్బులపై ఎలాంటి ప్రభావం ఉంటుందని చూస్తారు. చివరి దశలో ఈ వ్యాక్సిన్ ఏ వయసు వారిపై ఎలా పనిచేస్తోంది అన్నది చూస్తారు. ఇందులో ఓ ఒక్కటి సెట్ కాకపోయినా మెడిసిన్ ఆపేస్తారని డేవిడ్ పేర్కొన్నారు.

Related posts