telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రేపటి నుంచి ఏపీలో విద్యా సంస్థలు బంద్​

private schools collecting interest on late fee

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ, వైద్య శాఖల ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. రేపటి నుంచి అన్ని విద్యా సంస్థలను మూసివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఆదేశాల మేరకు పాఠశాలలు, కళాశాలలు, యూనివర్శిటీలు, కోచింగ్ సంస్థలు మూసివేయనున్నారు.

దేశంలో వైరస్‌తో ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా, తాజాగా ఇవాళ మరొకరు చనిపోయారు. దీంతో కరోనా మృతుల సంఖ్య మూడుకు చేరింది. మహారాష్ట్ర ముంబయిలో 64 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మృతి చెందినట్లు ఆ రాష్ట్ర వైద్యులు నిర్ధారించారు. మహారాష్ట్రలో మొత్తం 36 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

Related posts