telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘అదిరింది’ జడ్జి స్థానంలోకి హీరోయిన్‌… రోజాకు పోటీగా

roja-nagababu

జబర్ధస్త్ నుంచి అదిరింది షోలోకి వెళ్లిన నాగబాబుతో పాటు పలువురు కమెడియన్లు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ కార్యక్రమం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదనే టాక్ ఉంది. ఇదిలా ఉంటే తాను జడ్జిగా వ్యవహరిస్తున్న అదిరింది ప్రొగ్రామ్‌లో జడ్జిగా ఓ వెటరన్ హీరోయిన్‌ను తీసుకొచ్చేందుకు నాగబాబు ప్రయత్నాలు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. జబర్ధస్త్ నుంచి నాగబాబు బయటకు వచ్చినా… ఆ షోను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్లడంలో రోజా బాగా సక్సెస్ అవుతున్నారు. నాగబాబు లేని లోటు జబర్ధస్త్‌లో కనిపించకుండా చేయడంలో రోజా చాలానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓ వైపు జబర్ధస్త్‌లో రోజా దూసుకుపోతుండటంతో… అదిరిందిలోనూ ఆమెకు ధీటుగా ఉండే లేడీ జడ్జిని తయారు చేయాలని నాగబాబు గట్టిగా డిసైడయ్యారని తెలుస్తోంది. త్వరలోనే ఓ వెటరన్ హీరోయిన్‌ను తన పక్కన జడ్జి స్థానంలోకి తీసుకురాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

Related posts