telugu navyamedia
సినిమా వార్తలు

తల్లి కాబోతున్న బాలీవుడ్‌ సెక్సీ బిపాషా.. బేబీ బంప్‌తో బోల్డ్ పిక్స్ షేర్ చేసిన హీరోయిన్…

బాలీవుడ్‌ సెక్సీ బ్యూటీ బిపాషా బసు తన ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌ చెప్పింది. త్వరలోనే తాను తల్లిగా ప్రమోషన్‌ పొందనున్నట్లు అధికారికంగా తెలిపింది. ఈ మేరకు బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేసింది.

బిపాసా 2001లో వచ్చిన అజ్‌నబీ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది. ఈ సినిమాలో బిపాసా నటనకు గాను ఆమెకు ఫిల్మ్ ఫేర్ బెస్ట్ ఫీమేల్ డెబ్యూ అవార్డు వచ్చింది. 2002లో వచ్చిన రాజ్ సినిమా కూడా బిపాసకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత 2003లో వచ్చిన జిస్మ్ సినిమాలో కూడా బిపాస తన అందచందాలతో అందర్నీ ఆకట్టుకుంది.

ఈ క్రమంలోనే 'ఎలోన్‌' సినిమాలో నటుడు కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌తో తొలిసారి నటించింది.

హిందీలో ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. మహేశ్‌ బాబుతో కలిసి టక్కరి దొంగ సినిమాలో సందడి చేసిందీ బెంగాలీ బ్యూటీ.

కాగా ఈ అందాల తార చివరిసారిగా 2015లో ‘ఎలోన్‌’  అనే సినిమాలో నటించింది. ఈ చిత్రంలో హీరోగా నటించిన కరణ్‌సింగ్ గ్రోవర్‌తో ప్రేమలో పడిందామె. కొన్ని నెలల పాటు డేటింగ్‌ చేసిన ఈ జోడీ 2016లో పెద్దల అనుమతితో కలిసి పెళ్లిపీటలెక్కారు. ఆరేళ్లుగా ఎంతో అన్యోన్యంగా కలిసి జీవిస్తున్నారిద్దరూ.. ఇప్పుడు తల్లిదండ్రులుగా మారారు.

 బిపాసా ప్రస్తుతం ఎక్కువగా సినిమాల్లో కనిపించడం లేదు. ఇప్పుడు ఆమె ఫిట్ నెస్‌పై ఫోకస్ పెట్టింది. ఫిట్ నెస్ కోసం స్పెషల్ వీడియోలు చేస్తు... హల్ చల్ చేస్తుంది. చాలా కాలం నుంచి ఆమె సినిమాలకు చాలా దూరంగా ఉంటుంది. 2015 ఎలోన్ సినిమా తర్వాత ఆమె సినిమాల్లో కనిపించలేదు. 2015లో డర్ సబ్‌కో లగ్‌తా హై వెబ్ సిరీస్‌లో హోస్ట్‌గా కనిపించింది బిపాసా.

తాజాగా భర్త కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌తో రొమాంటిక్‌ పోజుల్లో దిగిన ఫొటోలను పంచుకుంటూ త్వరలోనే తాము తల్లిదండ్రులం కానున్నట్లు స్పష్టం చేసింది. దీంతో పాటు ఓ ఎమోషనల్‌ నోట్‌ పోస్ట్ చేసింది. మా లైఫ్‌లోకి మరింత సంతోషం రానుంది. మా మాధ్య ఉన్న అపారమైన ప్రేమకు గుర్తుగా త్వరలోనే మేం ముగ్గురం కాబోతున్నామ‌ని అన్నారు.

త్వరలోనే మా బిడ్డ మా ఇంట్లోకి అడుగుపెట్టనుంది. మీరు మాపై చూపిస్తోన్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞురాలిని’ అంటూ ఆ నోట్‌లో రాసుకొచ్చింది బిపాసా. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు ప్రముఖులతో పాటు అభిమానులు బిపాసా దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు చెబుతున్నారు..

Related posts